Homeఆంధ్ర ప్రదేశ్అరటి ధరలకు రెక్కలొచ్చాయి.. గెల ఎంతో తెలుసా..?

అరటి ధరలకు రెక్కలొచ్చాయి.. గెల ఎంతో తెలుసా..?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి ధరలు భారీగా పెరిగాయి. జనవరి నెల వరకు కర్పూర చక్కర కేలి, తెల్ల చక్కర కేలి, ఎర్ర చక్కెర కేలి గెలకు రూ.200 నుంచి 300 రూపాయలు పలికింది. కానీ ఇప్పుడు ఏకంగా పైన తెలిపిన అన్ని చక్కెర కేళి గెల 700 నుంచి 1000 రూపాయలు పలుకుతుంది. దీంతో అరటి పండించిన రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత అరటి పండ్ల ధరలు పెరగడం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక వేసవికాలం వరకు కూడా ఇవే ధరలు ఉండబోతాయని వ్యాపారులు సైతం చెప్పడంతో.. అరటి పండ్లు పండించిన రైతుల ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో అరటినీ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. గత మూడు సంవత్సరాలుగా తక్కువ ధరలు అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల అరటి పండ్లు సాగు చేసిన రైతులు ఎన్నో విధాలుగా నష్టపోయారు. గత మూడేళ్లుగా రైతులు నష్టాలు చవిచూస్తుండడంతో ఈ ఏడాది కాస్త విస్తీర్ణం తగ్గింది. డిమాండుకు తగ్గట్లు అరటి పండ్లు మార్కెట్లోకి రావట్లేదు. కానీ ఈ ఏడాది మాత్రం అరటి పండ్లు పండించిన రైతులకు ఆదాయం భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రెండు రోజుల నుంచి గుంటూరులో మిర్చి ధరలు క్వింటా కు మూడు వేల రూపాయలు తగ్గినట్టు సమాచారం.

పోస్టు మార్టంలో సంచ‌ల‌న నిజాలు

పోస్టు మార్టంలో సంచ‌ల‌న నిజాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments