తెలంగాణ

కుళ్ళిన కోడి మాంసం అమ్ముతూ.. అడ్డంగా బుక్ అయిన బాలయ్య!

హైదరాబాదులో మరో గలీజ్ దందా బయటపడింది. కేవలం 42 50 రూపాయలకే కేజీ చికెన్ ను బార్లకు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్ముతున్న బాలయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. అసలు విషయానికి వస్తే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జిహెచ్ఎంసి అధికారులు బేగంపేటలో ఉన్నటువంటి చికెన్ సెంటర్ లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. సుమారు 700 కిలోల కూలిపోయిన కోడి మాంసాన్ని గుర్తించారు. ఈ కుళ్ళిన కోడి మాంసం నమ్ముతున్న వ్యక్తి బాలయ్యగా గుర్తించారు. ఇక బాలయ్యతో పాటుగా మరో 15 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా దూరంగా ఉన్నటువంటి ఈ చెన్నై అలాగే ముంబై నగరాల నుండి చాలా తక్కువ ధరకే మాంసాన్ని తెచ్చుకొని వాటిని సంచుల్లో పెట్టి నగరంలోని రెస్టారెంట్లకు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు 30 నుంచి 50 రూపాయలకే అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ 700 కిలోల మాంసం అనేది దాదాపుగా 10 నుంచి 15 రోజులు పాటుగా నిల్వ ఉంచిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం అనేది హైదరాబాదులో అందరికంట పడింది. దీంతో ఎక్కడ చూసినా కూడా ఈ విషయమే చర్చించుకుంటున్నారు.

Read More : అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన గుడ్డులో కోడిపిల్ల

ప్రస్తుతం హైదరాబాదులో ఎక్కడ చూసినా సరే ఈ 700 కేజీల కుళ్ళిన కోడి మాంసాన్ని అమ్ముతున్నటువంటి వ్యక్తిపై ఆరా తీస్తున్నారు. బాలయ్య అనే చికెన్ వ్యాపారి గతంలోనూ ఇలాంటి కంటోన్మెంట్ ప్రాంతంలోని రసల్పూర్ లో కూడా ఇలాంటి కుళ్ళిన చికెన్ షాప్ లను విక్రయిస్తున్నాడని పోలీసులు తేల్చారు. తద్వారా అతన్ని పోలీసులు ఇంకా ఎక్కడైనా ఇలాంటి షాపులు నిర్వహిస్తున్నాడనే ఒరేయ్ బుడ్డి కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇంతటి మోసాన్ని చేస్తున్న ఈ చికెన్ వ్యాపారి బాలయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రజలు అందరూ పోలీసులను కోరుతున్నారు.

Back to top button