సినిమా

25 కాదు..12నే విడుదల చేయాలని బాలకృష్ణ ఫ్యాన్స్ డిమాండ్!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- నందమూరి బాలకృష్ణ నటించినటువంటి “అఖండ-2” సినిమా కొన్ని వివాదాల కారణాలవల్ల ఆగిపోయిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలి అని మూవీ యూనిట్ భావిస్తుండగా.. అలా కుదరదు ఈ నెల 12వ తేదీనే విడుదల చేయాలి అని నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఫ్యాన్స్ ఇలా డిమాండ్ చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒకవైపు వచ్చే వారంలో ‘అవతార్ 3’ రిలీజ్ కానుంది. కాబట్టి బాలకృష్ణ అఖండ -2 సినిమా కలెక్షన్ల పై ప్రభావం భారీగా చూపుతుంది అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు డిసెంబర్ 25వ తేదీన బాలకృష్ణ సినిమా విడుదల చేస్తే ఆ తరువాత సంక్రాంతి పండుగకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండడంతో ఆ పదిహేను రోజుల్లోనే కలెక్షన్ల పై ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే రిలీజ్ చేయాలని ఫాన్స్ కోరుతున్నారు. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడడంతో ఆగ్రహంగా ఉన్నటువంటి ప్రేక్షకులు త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయకపోతే మరింత ఆగ్రహించే అవకాశం ఉంది. ఇక ఈరోస్ సంస్థతో వివాదం విషయంపై రేపు ఒక క్లారిటీ వస్తుంది అని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఇక ఆ క్లారిటీ వచ్చిన తరువాతనే ఈ సినిమా విడుదల తేదీపై కొత్త అప్డేట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. కాగా విడుదల సమయంలో వివాదం చోటు చేసుకున్న సందర్భంగా ఇప్పటికే బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ తన రెమ్యూనేషన్ కాస్త తగ్గించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి కానుకగా ప్రభాస్ మరియు చిరంజీవి వంటి దిగ్గజ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమా ముందుగానే విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read also : ఈ రెండేళ్లలో మోసం చేయడం, దోచుకోవడంమే జరిగింది : బీజేపీ నాయకులు

Read also : సీఎంతో మ్యాచ్.. పకడ్బందీగా ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button