Tuesday, February 24, 2026
Homeక్రైమ్బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

కార్పొరేట్ కాలేజీలు మరో విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయి. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. బాచుపల్లి నారాయణ కాలేజ్ లో అనూష ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ ఈరోజు మధ్యాహ్నమే హాస్టల్లో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. తల్లితండ్రులు సిటీ దాటిలోపే అనూష స్పృహ కోల్పోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది కాలేజీ యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని తెలిపింది యాజమాన్యం. తల్లితండ్రులు వచ్చేసరికి అనూష డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలేజి సిబ్బంది తీరుపై విద్యార్థిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాచుపల్లి పోలీసులు కాలేజీ యాజమాన్యానికి వంత పాడుతున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments