
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని శివకేశవ ఆలయంలో నిత్య అభిషేకాలతో, ప్రత్యేక పూజ కార్యక్రమాలతో కొలువైన ‘అయ్యప్ప విగ్రహం’ అయ్యప్ప మాలధారణ భక్తులచే శబరిమల లోని సన్నిధానంకు బయలుదేరింది. సన్నిధానానికి బయలుదేరిన అయ్యప్ప విగ్రహానికి పంబా నదిలో జలక్రీడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సన్నిధానంలో ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. శబరిమలలో పెద్ద పాదం ద్వారా అయ్యప్ప ప్రతిమను సన్నిధానం కు చేర్చి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శివ కేశవ ఆలయ అర్చకులు వంగల సత్యనారాయణ చారి తెలిపారు.
రిలీజ్ అవ్వకముందే అంత సిద్ధం చేసుకోవాలి కదా.. మూవీ మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్?





