
చండూరు,క్రైమ్ మిర్రర్:- చండూరు అయ్యప్ప దేవాలయంలో 34 మండల మహా పడిపూజ మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పడి దాత గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గురుస్వామి (12వ పడి).. పడిపూజ మహోత్సవాన్ని చంద్రశేఖర్ నాయక్ గురుస్వామి గారిచే నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ చిరి వెల్లి హరికిషన్ శర్మ, బ్రహ్మశ్రీ చిరివెల్లి ప్రవీణ్ శర్మ,అజయ్ శర్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత అధ్యక్షుడు కోడిగిరి బాబు, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న,గురు స్వాములు రాపోలు విగ్నేష్, కట్ట అంజయ్య బొమ్మర బోయిన వెంకటేశ్వర్లు, అలంకరణ దాతలు దోటి వెంకటేష్ యాదవ్, అనంత చంద్రశేఖర్,భజన బృందం దాత కరింగు రామ్మూర్తి,మండల కాలంలో స్వాములకు నిత్య అన్నదాత బొబ్బల వెంకటరామిరెడ్డి(టామ్ రెడ్డి)స్టేజి దాత దోమల శ్రీను యాదవ్, పంచామృతం దాతలు ముమ్మడి యాదగిరి గురుస్వామి నడి కూడ సైదాచారి, అన్నదాతలు గంగిశెట్టి మారయ్య అండ్ సన్స్, గురు స్వాములు, సరికొండ వెంకన్న, రామస్వామి వెంకటేశ్వర్లు,ఐతరాజు మల్లేష్,పన్నాల లింగయ్య,గంట విజయ్, సముద్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read also : Health: చలికాలంలో పొద్దున్నే దీనిని తాగితే చాలు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
Read also : మహిళా మేనేజర్‌పై సీఈవో అత్యాచారం.. కెమెరాలో నమోదు





