
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-అయ్యప్ప మాలలు ధరించినటువంటి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున శబరిమలకు చేరుకుంటున్నారు. కార్తీకమాసంలో మొదలైన ఈ దీక్షలు గత కొద్ది రోజుల నుంచి విరమిస్తూ వస్తున్నారు. కొన్ని లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి తరలివస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఎదురుచూసేటువంటి శబరిమల మకర జ్యోతి గురించి కీలక ప్రకటన విడుదలయ్యింది. 2026 జనవరి 14వ తేదీన శబరిమలలో మకర జ్యోతి కనిపించనుంది అని అధికారులు వెల్లడించారు. జనవరి 14వ తేదీన సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నంబలమేడు వద్ద దర్శనం ఇస్తుంది అని అంచనా వేశారు. జ్యోతి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులను ముందుగానే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఇక జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తూ ఉండగా 20 తేదీన ఆలయం మూసివేయనున్నారు.
Read also : Parrot beak: వామ్మో.. కోడి ఖరీదు రూ.35,000
Read also : (VIDEO): ప్రిన్సిపల్‌తో టీచర్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త





