-
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు
-
రోడ్డు భద్రత నియమాల పై ఆటో డ్రైవర్స్ కు, ఓనర్స్ కు అవగాహన కార్యక్రమం
-
మండల ఎస్ఐ ఎస్.కృష్ణయ్య వెల్లడి
క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని సెంటర్ లో మంగళవారం ఎస్‌ఐ ఎస్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణయ్య మాట్లాడుతూ..
ఎస్‌పి శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు, మిర్యాలగూడ రూరల్ సీఐ ఉత్తర్వుల ప్రకారం మండల కేంద్రంలోని ఆటో యూనియన్ డ్రైవర్లతో అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించరాదని, సెల్ ఫోన్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు.
ప్రతి వాహనాలకు రికార్డులు సక్రమంగా ఉండాలని, ఇన్సూరెన్స్ విధిగా చేయించాలని, ఆటో లలో పరిమితికి మించి ప్రయానికులను ఎక్కించరాదని, మోటార్ వెహికల్ ఆక్ట్ రూల్స్ ప్రకారం విధులు సక్రమంగా పాటించాలని, ఆటో డ్రైవర్స్ యూనిఫారం ధరించాలని తదితర అంశాలపై డ్రైవర్స్ కు ఎస్‌ఐ కృష్ణయ్య సూచించారు.





