
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి క్యాన్సిల్ అయింది అని స్వయానా ఆమె ప్రకటించారు. తన పెళ్లి క్యాన్సిల్ అయింది అని.. గత కొద్ది వారాలుగా నా జీవితంపై ఎన్నో అనుమానాలు, అవమానాలతో పాటుగా ఎన్నో రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అని అన్నారు. నా పెళ్లి క్యాన్సిల్ అయింది అని స్మృతి మందాన తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మేటర్ ను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడితోనే వదిలేయాలి అని… ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలి అని రిక్వెస్ట్ చేశారు. ఇన్స్టా వేదికగా స్మృతి మందాన పెళ్లి రద్దయినట్లుగా క్లారిటీ ఇచ్చింది. కాగా గత కొద్ది రోజుల నుంచి స్మృతి మందన చేతికి ఎంగేజ్మెంట్ రింగు లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఉంగరం ఏమయింది?… పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా?.. అంటూ త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తారా?.. అని ఎన్నో ప్రశ్నలు అడుగుతుండడంతో తాజాగా పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ స్మృతి మందన షాకింగ్ న్యూస్ తెలపడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.
Read also : Murder Case: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Read also : వేములపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఝరూ..!





