
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయదారులందరూ కూడా సమస్యలను ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిపోతుంటే చంద్రబాబు నాయుడు రైతులను విధికి వదిలేసి పట్టించుకోవట్లేదు అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. “హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఒకసారి చూడండి” అంటూ ఎద్దేవా చేసారు. అక్కడ కేజీ అరటి 0.50 పైసలు మాత్రమే. ఇది అసలైన నిజం. రాష్ట్ర రైతుల దుస్థితికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన పంటలలో ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు అని.. ఒకసారి రైతుల పరిస్థితిని గమనించండి అని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గత మా ప్రభుత్వంలో ఒక టన్ను అరటి పంటకు 25 వేల రూపాయలు ఇచ్చామని అన్నారు. ప్రత్యేకంగా రైతుల పంటలకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేశామని ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. మరి జగన్ చేసినటువంటి వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
Read also : కిడ్నీలు బాగుండాలి అంటే ఎన్ని లీటర్ల నీళ్లు త్రాగాలో తెలుసా?
Read also : సర్పంచ్ పదవి వేలం.. 73 లక్షలకు దక్కించుకున్న ముస్లిం మహిళ





