
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా అడ్లూరు శివారులోని రాధా సత్సంగ్ వెనకాల జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మద్దికుంట గ్రామానికి చెందిన టేకులపల్లి జీవన్ రెడ్డి(37) కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. జీవన్ రెడ్డికి ముస్తాబాద్ మండలం మురాయిపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి మోక్ష,కృతిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత రెండు మూడు సంవత్సరాల నుండి గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర నుండి చందన తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుండి జీవన్ రెడ్డి తన భార్య చందనకు ఎన్ని సార్లు అడిగినా కాపురానికి రావడం లేదు. ఇటీవల విడాకుల నోటీసు రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో డ్యూటీ కి వెళ్తున్నానని చెప్పి బైక్ పై ఇంటి నుండి బయలుదేరాడు. ఇంటి నుండి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులో గల రాధాస్వామి సత్సంగ్ అవసరం వెనకాల శవమై ఉన్నాడని సమాచారం వచ్చింది. పక్కనే పశువుల కాపరి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.దీంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి,రూరల్ సీఐ రామన్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.సమాచారం అందుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also : సోషల్ మీడియాతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : SI యుగేందర్ గౌడ్
Read also : ఒక్కొక్క కుటుంబానికి 3000 రూపాయలు, 25 కేజీల బియ్యం : సీఎం





