![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/01/images-20-1.jpeg?lossy=1&strip=1&webp=1)
కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిల అన్నారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో చేపట్టిన థాలి బజావో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అనేది సూపర్ ప్లాప్ అన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చి 7 నెలలు అయింది. రియల్ ఎస్టేట్ ప్రమోషన్‌లా సూపర్ సిక్స్ బ్రోచర్‌ను మిగిల్చారు. ఎన్నికలకు ముందు ఒడమల్లన్న గెలిచాక బోడి మల్లన్న అంటూ ఇదే బాబు తీరు అని ఫైర్ అయ్యారు. రైతులకు రూ.20వేలు ఇస్తాం అన్నారు. ఇప్పుడు కేంద్రం రూ.10వేలు ఇస్తే…రాష్ట్రం రూ.10వేలు కలిపి ఇస్తారట. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తాం అన్నారు. ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ అన్నారు. ఈనాటికి విధివిధానాలు లేవు. 50 లక్షల మంది తల్లులు 80 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
మహిళలకు మహాశక్తి పథకం కింద ప్రతి నెల రూ.1500 అన్నారు. ఇప్పటికీ దీని గురించి ప్రస్తావన లేదు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు అన్నారు. నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ 1. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే వరకు కనీసం భృతి ఇవ్వాలి కదా ? నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు ఇస్తామని మోసం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. అధికారంలో వచ్చి జనవరి దాటిపోతుంది. మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీపై పట్టింపు లేదు. తొలి సంతకం పెట్టిన డీఎస్సీ నోటిఫికేషన్‌కే దిక్కులేదు. 16వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు. 7 నెలలు గడిచినా దిక్కులేదు. ఇక వాలంటీర్లకు ఇచ్చిన మాట సంగతి దేవుడెరుగు.
నందమూరి నటసింహానికి పద్మభూషణ్ అవార్డు!..
పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మన రాష్ట్రంలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రతి నెల కేవలం రూ.350 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి కూడా 7 నెలలుగా దిక్కులేదు. సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని తెలియదా..? అన్ని తెలిసే కదా చంద్రబాబు హామీలు ఇచ్చారు.