
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- పాకిస్తాన్ దేశంలో మరొక విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా బాంబు పేలడంతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లబోదిబోమని పరుగులు తీశారు. భయంతో ప్రాణాలను జేబులో పెట్టుకుని.. ఎలా పడితే అలా పరిగెత్తడంతో.. భారీగా తొక్కిసలాట జరిగింది. అసలేం జరిగింది అని తెలిసేలోపే ఒకరు మృతి చెందారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే ఒకరు మృతిచెందగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Red also మతసామరస్యం వెలసిన ఘటన.. గణేష్ లడ్డు దక్కించుకున్న ముస్లిం మహిళ
దేశంలోని బజావుర్ ఖార్ జిల్లా, కౌసర్ క్రికెట్ మైదానం లో ఈ బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా మైదానంలో బాంబు పేలడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా దట్టమైన పగలు కమ్ముకోవడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. దీంతో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లతో పాటుగా అక్కడే ఉండి ఆటను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడికక్కడే భారీగా తొక్కిసలాట జరగడంతో ఎవరైతే నేమి ఒక మనిషి అయితే మరణించారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ లో కొత్తేమీ కాదు. కాగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ అయితే ఆడేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత క్రికెట్ ప్లేయర్స్ భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Read also : భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ధర ఎంతంటే?