
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య అనారోగ్యానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరులవుతుంది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించగా ఒకవైపు జనసేన నాయకులు మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి రెండు మూడు రోజులు పాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చు.
ఇక పవన్ కళ్యాణ్ కు వచ్చిన స్పాండిలైటిస్ అనేది ఎటువంటి రకమైన వ్యాధి అని సోషల్ మీడియాలో చాలామంది నెటిజనులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యాధి అనేది ఈరోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పులు వలన వస్తుందని, అలాగే ఇది మహిళల కంటే పురుషులలో రెండు రెట్లు ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని, ఇంతే కాకుండా మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలకు ఒత్తిడి కారణంగా వీటి మధ్య తీవ్రమైన నొప్పి కలుగుతుందని ప్రముఖ డాక్టర్లు తెలిపారు. అందుకే వీలైనంతవరకూ కాస్త పని ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ కు డాక్టర్లు సలహా ఇచ్చారు. ప్రస్తుతం డాక్టర్ల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.