
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన భారతదేశంలో ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ ఎంతలా ఉపయోగిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సాధారణ డబ్బు కంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికే ప్రతి ఒక్కరు కూడా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది ఎంతలా అభివృద్ధి చెందింది అంటే.. మీరే ఆశ్చరర్యపోతారు. తాజాగా కేరళలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేరళలో జరిగినటువంటి ఒక పెళ్లి వేడుకలో పెళ్ళికొడుకు కుటుంబ బంధువు అయినటువంటి ఒక వ్యక్తి తన జేబుకు యూపీఐ క్యూఆర్ కోడ్ ను తగిలించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లికి వచ్చినటువంటి బంధువులు అలాగే మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కట్న కానుకలను ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లకు అలాగే ఫంక్షన్లకు వచ్చినటువంటి బంధువులు పెళ్లికి ఎంతో కొంత కట్న కానుకలుగా డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బును తీసుకోవడానికి బద్దకమైందో ఏమో తెలియదు కానీ అతను నేరుగా క్యూఆర్ కోడ్ ను జేబుకు తగిలించుకొని ఎవరైనా మనీ పంపించాలి అనుకుంటే పంపించండి అంటూ పెళ్లి వేడుకలో అటు ఇటు తిరగడం ప్రతి ఒక్కరిని షాకు కు గురిచేస్తుంది. దీంతో ఇక రాబోయే కాలంలో అన్ని పెళ్లి వేడుకలలో కూడా ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తుంది అని మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయోంచే కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పెళ్లి వేడుకలలో కూడా ఇదేం విడ్డూరం రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read also : భారీ వర్షాలు….. ఆదర్శంగా నిలిచిన దేవరకొండ కోర్టు సిబ్బంది
Read also : భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి : ఎస్ఐ యుగంధర్ గౌడ్





