
– ఎంతో చక్కగా బడికి వెళ్లిన విద్యార్థులు
– సరదాగా నీటిలో మునుగుదామని వెళ్లి తిరిగిరాని లోకాలకు
– మృత్యువుడిలోకి చేరిన ఆరు గురు చిన్నారులు
– శోకసంద్రంలో మునిగిన గ్రామం
క్రైమ్ మిర్రర్ , ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా నీటి గుంతలో మునుగుతూ ఏకంగా ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలు తో పాటుగా గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే… అదోని.. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. చిగిలి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు దాదాపు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఐదవ తరగతి చదివేటువంటి విద్యార్థులలో ఆరుగురు విద్యార్థులు నేడు మరణించారు. శశి కుమార్, కిన్నెర సాయి, సాయికిరణ్, ఉప్పలపాటి బీమా, షేక్ మహబూబ్, దుర్గాప్రసాద్, వినయ్… వీళ్ళందరూ కూడా దాదాపు పది సంవత్సరాలలోపు వారే. ప్రతిరోజు అందరూ విద్యార్థులు లాగానే ఈ ఏడుగురు విద్యార్థులు కూడా పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుంటూ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవారు. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా పాఠశాలల్లో చదువుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక అందరూ కలిసి సరదాగా ఊరు చివర తవ్వకాలు చేసినటువంటి గుంతల్లో వర్షపు నీరు చేరడంతో ఆ నీటిలో ఆడుకోవడానికి వెళ్లారు. నీటిలో దిగిపోయిన విద్యార్థులు ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే నీటిలోనే మునిగిపోయారు. గట్టునున్న ఏడవ విద్యార్థి వాళ్లను చూసి భయపడి ఊర్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి అందరిని పిలుచుకొచ్చాడు. గ్రామంలోని ప్రజలు హుటాహుటిన వచ్చి ఆ విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అందరూ మరణించారు. అంతా కూడా ఒక గంటలోనే జరిగి పోవడంతో ఆరుగురు తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు.
Read also : దీనస్థితిలో ఉన్న మరో కమెడియన్.. ఇతనైనా కోలుకోగలడా?