అమెరికా నూతన ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా సరే యుద్ధం ఆపేయాల్సిందే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను హెచ్చరించారు. తక్షణమే యుద్ధం ఆపుకుంటే రష్యాకు కఠిన ఆంక్షలు విధిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం కనుక ఆపకుంటే రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యేటువంటి ప్రతి వస్తువు పై భారీగా పన్నులు మరియు టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. అసలు నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం ప్రారంభమయ్యేదే కాదని అన్నారు. తక్షణమే యుద్ధానికి ముగింపు పలకాల్సినటువంటి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఈ యుద్ధంలో ఇకనుండి ఒక ప్రాణం కూడా పోవడానికి వీలులేదని నూతన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక రాజు లాగా ఆజ్ఞను విసిరారు. మరి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలను రష్యా పట్టించుకుంటుందో లేదో తెలియదు కానీ అమెరికాకు నూతన అధ్యక్షుడు అయినటువంటి వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అలాగే అన్ని దేశాల్లోనూ హైలైట్ గా మారింది. మరి డోనాల్డ్ ట్రంప్ మాటకు విలువిచ్చి యుద్ధం ఆపుతారో లేదా అనేది వేచి ఉండాల్సిందే.
ఇవి కూడా చదవండి
1.తొక్కిసులాట పై యాంకర్ ప్రశ్న !.. సీఎం రేవంత్ జవాబు ఇదే?
2.భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం