
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. 2047 వ సంవత్సరంలోపు దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ సంకల్పంగా భావిస్తున్నామని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ముఖ్యంగా రాజధాని కి ప్రముఖ స్టార్ హోటల్లు కొలువుదీరేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందింది. దాదాపు 200 కోట్లతో దసపల్లా, 177 కోట్లతో SGHRL వంటి 4 స్టార్ హోటళ్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే VHR సంస్థ అరకులో 56 కోట్లతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ప్రతిపాదించింది. అంతేకాకుండా ప్రభుత్వం వీరికి ఊరట కల్పించేలా పదేళ్ల వరకు SGST అలాగే ఐదేళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో దేశంలో పలు ముఖ్య నగరాల్లో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్ కు ధీటుగా నూతన రాజధాని అమరావతిలో కూడా ఇలాంటి హోటళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.
Read also : బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు : డీజీపీ శివధర్ రెడ్డి
Read also : బీసీ రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటుంది : భట్టి విక్రమార్క