
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహం వచ్చే ఏడాదిలో జరగబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అల్లు శిరీష్ యంగ్ హీరోగా టాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ అలాగే కొన్ని బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతని ప్రియురాలు నైనికతోనే వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 6వ తేదీన వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నట్లుగా అల్లు శిరీష్ ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది మార్చి 6వ తేదీన ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని చాలామంది ప్రశ్నలు సంధిస్తున్న వేళ… గతంలో అల్లు అర్జున్ కూడా మార్చి ఆరవ తేదీనే పెళ్లి చేసుకున్నారు అని ఇక అదే రోజున తమ్ముడు కూడా ఒక ఇంటివాడు కాబోతున్నారు అని సమాచారం. దీంతో అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా అల్లు శిరీష్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అరవింద్ కొడుకులుగా అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోగా కానీ అల్లు శిరీష్ మాత్రం అతని అంత స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. బహుశా అందుకేనేమో అప్పుడప్పుడు పలు సినిమాలు చేస్తూ వేరే బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు.
Read also : తెలంగాణాలో నేటి ప్రధాన వార్త విశేషాలు..!
Read also : Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార కేసు, సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్!





