
తెలంగాణలో అన్ని కాలేజీలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు ప్రకటించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేవని.. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు రమేష్ బాబు. నవంబరు 1 లోపు రూ.900 కోట్లు విడుదల చేయకపోతే.. 3 నుంచి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటించారు.
నవంబరు 10వ తేదీ లోపు 2లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామని.. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకునేది లేదని.. ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని హెచ్చరించారు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు. నవంబర్ రెండో వారంలో 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ ముట్టడిస్తామని చెప్పారు.





