
క్రైమర్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మతమార్పిడులు అలాగే మతాలపై కుట్రలు జరుగుతున్న సందర్భాలు ప్రతిరోజు చూస్తున్నాం లేదా వార్తల్లో చదువుతున్నాం. ఈ మతమార్పిడి విషయాలపై తాజాగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మన భారతదేశం అలాగే ధర్మం కోసం హిందువులందరూ కూడా ఒకటి అవ్వాలని కోరారు. హిందూ మతం పై ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని.. వాటిని సహించేది లేదు అని విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బును ఎరగా వేసి.. అయోమయంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలను వేరే మతాల్లోకి మార్చుతున్నారు అని.. అలా మార్చడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మతాల మార్పిడి ప్రచారాలు చేస్తున్న వారికి సరైన గుణపాఠం నేర్పిద్దామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని.. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరపాలి అని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలోనే దేశ వ్యాప్తంగా హిందువులందరూ కూడా ఏకతాటిపై నిలబడాలి అని.. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు.
Read also : Politics: భర్తతో పోటీకి దిగిన భార్య
Read also : ఇండియా పరువు పోయింది.. రామ్మోహన్ వెంటనే రాజీనామా చెయ్ : గుడివాడ అమర్నాథ్





