
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఢిల్లీలో సాధారణంగానే గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంటుంది. అలాంటిది నిన్న దీపావళి కారణంగా ఢిల్లీలో టపాసులు కాల్చడంతో దేశంలోని చాలా ప్రాంతాలలో వాయు కాలుష్యం కమ్మేసింది. ఇక ఢిల్లీలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ గాలి నాణ్యత ముందు నుంచే చాలా తక్కువగా ఉంది. నిన్న కాల్చినటువంటి టపాసులతో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. నరైన్ అనే గ్రామంలో నిన్న రాత్రి 11:39 వాయు నాణ్యత సూచి (AQI) 1991 గా నమోదయింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ను తాజాగా ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్విట్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది. ఇది “హమారా ఢిల్లీ” అంటూ చాలా వ్యంగ్యంగా కూడా కామెంట్ చేయడంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ పోతుంది. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాదులో కూడా దీపావళి కారణంగా టపాసులు పేల్చడంతో AQI అనేది 151 పైగా నమోదు అయింది. దీంతో గాలి నాణ్యత తక్కువ ఉన్న ప్రాంతాలలో టపాసులు కాల్చవద్దని ఆంక్షలు విధిస్తే సరిపోయేది కదా అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది దీపావళి రోజు టపాసులు కాలిస్తే ఎక్కడైనా సరే పొగ రావాల్సిందే… పొగ వచ్చిన సమయంలో ఎక్కడైనా కూడా గాలి నాణ్యత తగ్గిందనే చూపిస్తుంది కదా… మళ్లీ మరుసటి రోజుకు అంతా కూడా మామూలు అయిపోతుంది. ఇంత దానికి ఇంత రాద్ధాంతం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : జూబ్లీహిల్స్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం, జోరందుకున్న ప్రచార పర్వం
Read also : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా అంటూ మండిపడ్డ కేటీఆర్