Thursday, March 12, 2026
Homeతెలంగాణమహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ!

మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ!

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకనిక చాకలి ఐలమ్మ అని రజక సంఘం మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతి… మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రజక సంఘం మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమికోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాటస్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.

బహుజన చైతన్యానికి.. మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప వ్యక్తి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు రెవెల్లి అంజయ్య,మండల ప్రధాన కార్యదర్శి రెవెల్లి సైదులు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, గురిజ రామచంద్రం, తిరుపాటి వెంకటేశ్వర్లు,పగిల్ల శ్రీరాములు, సైదులు, శ్రీను, నవీన్, గణేష్, ఎల్లయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read also : ఏ గోతిలోనైనా దూకి చావు.. చంద్రబాబుపై మండిపడ్డ జగన్?

Read also : గురుకులంలో తిండి లేక.. కలెక్టర్ కోసం గోడ దూకిన 70 మంది విద్యార్థులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments