
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం వ్యవసాయ యాంత్రీకరణ రాయితీ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాయితీపై అందజేస్తున్న యంత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రైతులతో ముచ్చటించి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆధునిక యంత్రాల వినియోగంతో వ్యవసాయ ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఏవో వెంకట రమణారెడ్డి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త శ్రీలత,యాదగిరిగుట్ట ఏ డి ఏ శాంతి నిర్మల,ఆలేరు ఏ డి ఏ శ్రీనివాస్ గౌడ్,ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆలేరు తహసీల్దార్ ఆంజనేయులు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని 8 మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,వివిధ కంపెనీల ప్రతినిధులు,స్థానిక ప్రజాప్రతినిధులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read also : Sergio Gor: భారత పర్యటనకు ట్రంప్, అమెరికా రాయబారి గోర్ కీలక ప్రకటన!
Read also : Kashmir: డ్రోన్లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు, తిప్పికొట్టిన భారత సైన్యం!





