⇒ అన్ని వస్తువులలో పెరిగిపోయిన కల్తీ
⇒ దేశవ్యాప్తంగా రైడ్స్ చేయాలని ప్రజలు డిమాండ్
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- మన దేశవ్యాప్తంగా ఎన్నో నిత్యవసర సరుకులలో కల్తీ జరగడం అనేది ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయింది. నిరంతరం సోషల్ మీడియాలలో ఈ వస్తువులో కల్తీ ఉంది, ఆ వస్తువుల కల్తీ ఉంది అంటూ ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో పలు ప్రాంతాలలో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో మాత్రం వీటికి పరిష్కారం అసలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిత్యవసర సరుకులపై దేశవ్యాప్తంగా ఒక 10 నుంచి 15 రోజులపాటు రైడ్స్ చేస్తే పూర్తిగా కల్తీ అనేది జరగకుండా పోతుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పాలు,పెరుగు,పన్నీరు,నెయ్యి,బియ్యము మరియు బిస్కెట్స్ ఇలా ప్రతి ఒక్క వస్తువులో కల్తీ కి అడ్డే లేకుండా పోయింది. కొంతమంది లాభాల కోసం వ్యాపారులు ప్రజల ప్రాణాలను బలి తీయడానికి సిద్ధమవుతున్నారు. చాలామంది అధికారులు అక్కడక్కడ తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారు అని ఇప్పటికే చాలామంది ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఏకంగా 6 మంది ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కల్తీలను అరికట్టేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక పది రోజులపాటు రైడ్స్ చేస్తే మొత్తం క్లీన్ చేయొచ్చు అని ప్రజలు చెబుతున్నారు. మరి ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాలు వీటిపై చిత్తశుద్ధి చేస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

