
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- నటి రేణు దేశాయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో నేను సన్యాసం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తాజాగా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా తాను డబ్బుకు లొంగే మనిషిని కాను అని… డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వను అని, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటానని నటి రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతికి, ఆధ్యాత్మికతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటానని తెలిపారు. అయితే గతంలో నటి రేణు దేశాయ్ రెండవ పెళ్లి గురించి ఖచ్చితంగా ఆలోచిస్తానని… పిల్లలకు 18 సంవత్సరాలు దాటాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో అని కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కేవలం పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకోలేదని రేణు దేశాయ్ వెల్లడించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతలోనే మళ్లీ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలపడంతో ఒకవైపు రేణు దేశాయ్ ఫ్యాన్స్ మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా కూడా రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై… సన్యాసం తీసుకుంటానని చెప్పిన మనిషి ఈమె అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం మీకు ఏముందని… మరి కొంతమంది రేణు దేశాయ్ కు సలహాలు ఇస్తున్నారు.
Read also : వార్ -2 పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగ వంశీ
Read also : ఇండియా పై ఆరోపణలు సరికాదు : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి