
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- KGF సినిమాలో కీలకపాత్ర పోషించినటువంటి హరీష్ రాయ్ అనే నటుడు తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. కాగా కేజిఎఫ్ చాప్టర్ 1 లో హరీష్ రాయ్ “ఛాఛా” అనే కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా ఈ నటుడికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే మరోవైపు కేజీఎఫ్ 2 రిలీజ్ అవ్వకముందు నుంచే అతను తీవ్రమైన క్యాన్సర్ తో బాధపడుతున్నారు అని సమాచారం అందింది. ప్రస్తుతం అది నాలుగో స్టేజికి చేరడంతో పూర్తిగా ఆరోగ్యం కోల్పోయి చాలా సన్నగా అయిపోయారు. ఆ తరువాత ఆసుపత్రిలో చేరగా.. డబ్బులు చాలా అవసరమయ్యాయి. దీంతో హరీష్ రాయ్ చాలామంది కుటుంబ సభ్యులతో పాటుగా నటులను కూడా ఆర్థిక సహాయం చేయాలని కోరగా వెంటనే అతని కుటుంబ సభ్యులు అలాగే నటుడు దృవ్ సర్జా పెద్ద మొత్తంలో డబ్బును సహాయం చేశారు. అయినప్పటికీ కూడా అతని జబ్బు నయం కాకపోవడం.. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉండడం కారణంగా పరిస్థితి చేయి జారిపోయింది అని.. దీని కారణంగానే అతను ఇవాళ మరణించారు అని అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇప్పటికే హరీష్ రాయ్ మృతి పట్ల పలువురు నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అతని అంతిక్రియలలో భాగంగా పలువురు నటులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
Read also : మోదీని ఇంట్రెస్టింగ్ క్యూస్షన్ అడిగిన మహిళా ప్లేయర్?
Read also : కీలక పదవుల్లో ఉన్న నాయకులు.. ఇలానా మాట్లాడేది : నెటిజన్లు ఆగ్రహం





