
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణలలో ఇండియా హస్తము ఉంది అంటూ పాకిస్తాన్ తాజాగా ఆరోపణలు చేయగా వాటిపై ఆఫ్ఘనిస్తాన్ స్పందిస్తూ తీవ్రంగా మండిపడింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి మహమ్మద్ యాకూబ్ వివరణ ఇస్తూ… భారత్ పై నిరాధారా, ఆమోదయోగ్యం కానీ ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఒక స్వతంత్ర దేశంగా భారతదేశానితో బంధం ఇలానే కొనసాగిస్తామని ఆఫ్గానిస్తాన్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎప్పటికీ కూడా అనుమతించబోమని ఒక క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ తో ఎప్పటికీ కూడా మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం… ఒకవేళ మీరు అది కోరుకోకపోతే తదుపరి ఏం జరగాలో అదే జరుగుతుంది అని వెల్లడించారు. కాగా పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు ముగ్గురు మృతి చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఘటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితులలో ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ మద్దతు తెలిపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి.
Read also : తండ్రీకొడుకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే : కన్నబాబు
Read also : భారీ వర్షాల వేల స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్