క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- భూపాలపల్లిలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బందిని ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది ఏసీబీ. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు భూపాలపల్లి జిల్లా కోర్టు సిబ్బంది. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్ నిర్వహించగా రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు కోర్టు సిబ్బంది. స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు న్యాయవాదిని లంచం డిమాండ్ చేశారు కోర్టు సిబ్బంది. దీంతో న్యాయవాది గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని పట్టుకుంది ఏసీబీ.
సత్యసాయి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
