Saturday, February 21, 2026
Homeతెలంగాణప్రతి ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి : మాజీ జెడ్పీటీసీ

ప్రతి ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి : మాజీ జెడ్పీటీసీ

•దేశంలో ఒక దగ్గరే ఓటు వుండాలి
•ఓటుకు నోటు ఇవ్వొద్దు ఓటుకు నోటు తీసుకో వద్దు
•ఆత్మకూరు(ఎం)మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం శుక్రవారం రోజు మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు పత్రికల వారితో మాట్లాడుతూ ప్రతి ఓటరుకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని,ఓటుకు నోటు వ్యవస్థ మారాలని, డబ్బులు ఇవ్వొద్దని, తీసుకోవద్దని, వ్యవస్థను మార్చాలని ఎన్నికల కమీషన్ ఖచ్చితమైన నిర్ణయం చేయాలని అందు కొరకై అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ వ్యవస్థ మారకుంటే గ్రామాలు ప్రజలు దోపిడీకి గురి అవుతారని లంచగొండి తనం పెరిగి పోతుందని యువత నడుం బిగించి ముందుకు రావాలని పూర్ణచందర్ రాజు డిమాండ్ చేసారు.ఓట్లలో ఎన్నికల్లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఎన్నికల కమీషన్ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాయని ఆయన అన్నారు.మంచికి స్థానం లేకుండా పోయిందని ఇదే విదంగా కొనసాగితే గుండా రాజకీయాలు ఇంకా పెరుగుతాయని వాపోయారు. ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే స్వచ్చమైన ఓట్లు మిగులు తాయని ఆయన అన్నారు. కొందరికి పట్టణాలలో గ్రామాల్లో ఓట్లు వుంటున్నాయనీ అన్నారు. అందరం ఒక ఉద్యమంగా తీసుకొని వ్యవస్థను మార్చాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని పూర్ణచందర్ రాజు కోరారు.

రాబోయే జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యను సన్మానించిన వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments