
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- జపాన్ లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత మూడు రోజుల క్రిందట జపాన్ లో భారీ భూకంపం సంభవించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నేడు ఉదయం మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతంలో సునామీ అలలు కొన్ని మీటర్ల ఎత్తులో ఎగిసిపడవచ్చు అని ఆ దేశ ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంపా కేంద్రం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించడంతో కుజి నగర పరిసర ప్రాంతాల్లోని ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
Read also : స్కైడైవర్‌లో విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్
సరిగ్గా నాలుగు రోజుల క్రితం వచ్చినటువంటి భూకంపం ప్రకంపనలు ఇదే ప్రాంతంలో రావడంతో చాలా ఇల్లు స్వల్ప ధ్వంసం అయ్యాయి. ఆ భూకంపం ప్రకంపనలకు దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ మరోసారి ఇదే ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలందరూ భయపడిపోయారు. అసలు ఏం జరుగుతుందా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ మధ్య వచ్చినటువంటి భూకంపం సందర్భంలో మన టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఆదేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ కి ఏమైనా అయిందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరా తీశారు. ఆ తర్వాత పలువురు డైరెక్టర్లు ప్రభాస్ క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే.
Read also : థియేటర్లలో తాండవం చేస్తున్న “అఖండ తాండవం”





