
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మన భారతదేశంలో మళ్లీ అల్లకల్లోలం సృష్టించేందుకు కొంతమంది ఉగ్రవాదులు భారీ ప్లాన్లు వేస్తున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలోనే వారు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మరువక ముందే హైదరాబాదులో మరొక పెద్ద ప్లాన్ బయటపడింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు పోలీసులు హైదరాబాదులో తనిఖీలు నిర్వహించగా.. ఒక భయంకరమైన సంఘటన ఎదురయ్యింది. హైదరాబాద్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహిద్దీన్ ను పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతనిని పూర్తిగా విచారణ చేయగా అతను పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని తేలింది. ఇవన్నీ కూడా రాజేంద్రనగర్ సర్కిల్ పోర్ట్ వ్యా కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్.. చైనాలో ఎంబిబిఎస్ చదివి తిరిగి ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. ఎంతోమంది ఉగ్రవాదులతో పరిచయం ఉన్నటువంటి ఇతను.. దేశంలోనే ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ దాడులు చేసేందుకు ప్లాన్ చేయగా.. ఇది దేశంలోని అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా తేల్చారు. ఇక దీన్ని ఎందులో కలిపినా కూడా గుర్తుపట్టే ప్రసక్తే లేదు. వీటిని దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో మంచి నీళ్లు మరియు గుడిలోని ప్రసాదాలలో కలిపి ప్రజలకు ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహిద్దిన్. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతుంది.
Read also : సంజు సాంసన్ అవుట్… కొత్త కెప్టెన్ రేసులో యువ క్రికెటర్స్?
Read also : నా భూమి నాకు ఇప్పించండి సారు..!





