లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :-
జయశంకర్ జిల్లా,కాటారం మండల కేంద్రంలో గూడూరు ఇప్పలపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు కాటారం మండలం గూడూరు ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఆత్మకురి రాజయ్య (55) ఆర్థిక పరస్థితుల నేపథ్యంలో తీవ్ర మనస్థాపనకు గురై గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు, ఇదే క్రమంలో ఆదివారం ఉదయం కాటారం వచ్చిన రాజయ్య అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద పడే ప్రయత్నం చేసాడు స్థానికులు అడ్డుకోని రక్షించగా మరి కాసేపట్లో లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Russian Oil Imports: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?
Amit Shah: మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత దేశంగా భారత్.. అమిత్ షా కీలక ప్రకటన!









