
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మంత్రి నారా లోకేష్ ఒక బాలిక విషయంలో మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న పిల్లలు కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు రాక, మరోవైపు చదివించడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్లతో పాటే పనులకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఏమి చేయలేని పరిస్థితులు. తాజాగా అలాంటి ఒక ఘటనే కర్నూలు జిల్లా బూదూరు గ్రామంలో ఎదురయింది. జెస్సి అనే చిన్న బాలిక కూలి పనుల నిమిత్తం పత్తి తీయడానికి పనులకు వెళ్తుంది. కేజీబీవీలో సీటు రాకపోవడంతోనే డబ్బులు కట్టే స్తోమత లేక కూలి పనులకు తీసుకెళ్తున్నామన్న తల్లిదండ్రుల వ్యాఖ్యలు మీడియాల ద్వారా మంత్రి నారా లోకేష్ వరకు చేరింది. ఈ బాలిక విషయంపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు.
Read also : భారత్ లోనూ నేపాల్ పరిస్థితిలు రావచ్చు : కేటీఆర్
జెస్సీ అనే బాలికను ఉద్దేశించి ఎటువంటి భయం అవసరం లేదు. అధికారులతో నేను మాట్లాడి నీకు కేజీబీవీలో సీటు వచ్చేలా చేస్తాను అని మాటిచ్చారు. చక్కగా బడికి వెళ్లి నిశ్చంతగా చదువుకో అని చెప్పుకొచ్చారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి… కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా పుస్తకాలు, పెన్ను పట్టుకోవాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం చాలా బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా విద్యకు పిల్లల్ని దూరం చేయకూడదని వేడుకుంటున్నాను అని సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు. మంత్రి నారా లోకేష్ ఆ బాలికకు చదువుకోవడానికి కేజీబీవీలో సీటు ఇప్పిస్తానని చెప్పడంతో జెస్సీ తల్లిదండ్రులతో పాటుగా గ్రామం మొత్తం కూడా లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : చిప్స్ అయినా.. షిప్స్ అయినా మన ఇండియాలోనే తయారవ్వాలి : ప్రధాని మోడీ