Homeజాతీయంరిలయన్స్ జియో ప్రభంజనం...!

రిలయన్స్ జియో ప్రభంజనం…!

  • గ్లోబల్ మార్కెట్లో సరికొత్త చరిత్ర

  • కోటిన్నరకి పైగా ఇన్వెస్టర్లతో ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థగా..

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రిలయన్స్ జియో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ప్రభంజనం సృష్టించింది. రిలయన్స్ గ్రూపునకు చెందిన జియో ప్లాట్ఫార్మ్స్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లలో అపూర్వమైన ఆదరణ దక్కించుకుంది. పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ముగింపు నాటికి ఏకంగా పోటీన్నరకు పైగా ఇన్వెస్టర్ల దరఖాస్తులను సాధించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సంస్థగా జియో అవతరించింది. గతంలో వారి ఎనర్జీస్ పేరుతో ఉన్న 97.3 లక్షల దరఖాస్తుల ఆల్ టైం వరల్డ్ రికార్డును అధిగమించింది. అంతర్జాతీయ ఆర్థిక చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. బిజినెస్ వర్గాల ప్రకారం మొత్తం ఇష్యూ దాదాపు 21.19 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.

ఒక్కసారిగా పెరిగిన ఆదరణ…

ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా రిలయన్స్ జియోకు ఆదరణ పెరిగింది.
క్వాలిఫైడ్ ఇంస్టిట్యూషనల్ బయర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిప్లై ఇండివిజువల్ ఇన్వెస్టర్లు సహా అన్ని విభాగాల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. సంస్థాగత మధుపర్ల నుంచి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన డిమాండ్ రావడం, రిటైల్ క్యాటగిరి లోను రికార్డు స్థాయిలో బిడ్లు నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల, జియో వృద్ధి ప్రణాళికల పట్ల మదుపరులకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది.

అగ్రగామిగా కొనసాగుతున్న వైనం…

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికాం, డిజిటల్ సేవల రంగంలోనూ జియో సబ్స్క్రైబర్ల పేస్ అగ్రగామిగా కొనసాగుతోంది. భారత్లో ఎప్పటికీ 53 కోట్లకు పైగా మొబైల్ చందాదారులను సొంతం చేసుకున్న జియో, చైనా వెలుపల ఒకే దేశం లో ఇంత భారీ ఎత్తున వినియోగదారుల పునాది కలిగిన అతిపెద్ద సింగల్ ఆపరేటర్ గా అరుదైన మైలురాయిని అధిగమించింది. ముఖ్యంగా ఫైవ్ జి నెట్వర్క్ విస్తరణలో 26 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకోవడంతోపాటు దేశీయ ఫిక్స్డ్ వైర్లెస్, బ్రాండ్ బాండ్ రంగంలోనూ రికార్డు స్థాయి వృద్ధుని కొనసాగిస్తూ గ్లోబల్ టెలికం నెట్వర్క్ లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ తరహా చారిత్రక రికార్డ్లతో భారత మార్కెట్ల స్థాయి ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కింది. కేవలం టెలికాం ఆపరేటర్ గా మాత్రమే కాకుండా ఏఐ, క్లౌడ్ డేటా, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫారం రూపాంతరం చెందిన జియో.. దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లను మార్కెట్ల వైపు పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో సాధించిన ఈ ప్రపంచ రికార్డ్ సబ్ స్క్రిప్షన్ ప్రయాణం.. రాబోయే రోజుల్లో ఇతర గ్లోబల్ టెక్ దిగజాలకు సైతం ఓ బెంచ్ మార్కుగా నిలవనుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. అనుమ‌తి లేకుండా ఫోటోలు తీశారు…! అలా చేయ‌డంతో మాన‌సికంగా ప్ర‌భావం చూపింది…అనుప‌మ‌
  2.  AP కి తుఫాన్ ముప్పు: భారీ వర్షాలు కురిసే అవకాశం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
  3.  ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ నియామకం!
  4. మహిళా నాయకులపై దాడులా?.. చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు