క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇండియన్ సినిమా రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, స్టార్ హీరోలు రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజా అప్డేట్ వెలువడింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.యువ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్లో ఈ భారీ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఒక ప్రమోషనల్ వీడియో విడుదల కావడం విశేషం. అయితే ఆ తర్వాత నుంచి సినిమా గురించిన ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకపోవడంతో, ఈ మూవీ అటకెక్కిందనే రూమర్స్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గట్టిగా నడిచాయి.
ఏపీలో వాయుగుండం కలకలం.. నేటి నుంచి విస్తారంగా భారీ వర్షాలు!
అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ, వచ్చే నెలలో షూటింగ్ నిర్వహించడానికి దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా మూవీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, వచ్చే డిసెంబర్ నుంచి ఈ షూటింగ్లో కమల్ హాసన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం అందింది. ఇద్దరు లెజెండరీ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
వైభవ్‌ను టీమ్ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t
