Homeక్రైమ్భర్త స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు.. బయటపెడితే కుమారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు!

భర్త స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు.. బయటపెడితే కుమారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో అతడి స్నేహితులే మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా, ఈ విషయాన్ని బయటపెడితే ఆమె కుమారుడిని చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్ జిల్లాలో అక్టోబర్ 8వ తేదీ రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి భర్త ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న సూరజ్ యాదవ్, విశాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆమె కుమారుడిని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం.

నిందితుల బెదిరింపుల నేపథ్యంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విరార్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ అరెస్టు చేశారు.

నిందితులను కోర్టులో హాజరుపరచగా.. విచారణలో భాగంగా స్థానిక న్యాయస్థానం వారికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

also read: జమ్మూకశ్మీర్‌ కుప్వారా సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు