Homeతెలంగాణదక్షిణాదిన నీరుగారిన 'కాక్రోచ్'...!

దక్షిణాదిన నీరుగారిన ‘కాక్రోచ్’…!

  • ఉత్తరాదితో పోల్చుకుంటే తేలిపోయిన ఉద్యమం

  • ఆసక్తి చూపని మీడియా

  • పట్టించుకోని యువత, సామాన్య జనాలు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా జనతా కాక్రోచ్ ఉద్యమాలు జోరుగా సాగుతున్నాయి. డిజిటల్ మీడియా వేదికగా ఏకమవుతున్న యువత ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జనతా కాక్రోచ్ ఉద్యమానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు.

ఇక్కడ యువత పెద్దగా ఆ ఉద్యమం వైపు మొగ్గు చూపడం లేదు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.. రాజకీయపరమైన, ఆర్థికపరమైన అంశాలు ఒక ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ యువత ఖాళీగా ఉండకపోవడం కూడా ఒక కారణం. అందుకే జనతా కాక్రోచ్ లాంటి ఉద్యమాల వైపు అస్సలు వారు వెళ్లడం లేదు.

  • అక్కడ సక్సెస్..

సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ ద్వారా పుట్టిందే జనతా కాక్రోచ్ ఉద్యమం. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అంశాలు విపరీతంగా ప్రభావం చూపాయి. పైగా నేషనల్ మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది.

అందుకే ఈ ఉద్యమం అక్కడ పతాక స్థాయికి చేరింది. యువత పెద్ద ఎత్తున అటువైపు మల్లారు. చివరకు విద్యాధికులు సైతం అటువైపు మళ్లడం విశేషం. కానీ ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాదిన ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో జనతా కాక్రోచ్ ఉద్యమం తేలిపోయింది.

  • ఆశించిన స్పందన లేదు..

దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల జనతా కాక్రోచ్ ఉద్యమానికి సంబంధించిన సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. కానీ యువత నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఈ ఉద్యమం తేలిపోయింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలకు మీడియా ప్రాధాన్యం కూడా లేకపోయింది.

అక్కడక్కడ స్థానిక మీడియా ప్రాధాన్యం ఇచ్చినా.. యువతతో పాటు ప్రజలు పట్టించుకోకపోవడంతో.. ఆ ప్రచారం కూడా పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఈ ఉద్యమాన్ని పట్టించుకునే వారు లేకపోవడం నిజంగా కాక్రోచ్ కు లోటు.

  • ఉద్యమాలకు దూరం..

ముఖ్యంగా దక్షిణాది యువత ఉద్యమాలకు దూరంగా ఉంటారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఐటీ పరంగా బాగా అభివృద్ధి చెందింది దక్షిణ భారతదేశం. చెన్నై తో పాటు బెంగళూరు, హైదరాబాదు నగరాలు ఐటీ పరంగా ఎనలేని వృద్ధి సాధించాయి. విపరీతమైన ఉద్యోగాల కల్పన జరిగింది.

నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో యువత ఖాళీగా ఉండడం లేదు. ఇంటర్, డిగ్రీ తర్వాత కూడా ఉపాధి బాట ఎక్కువగా పడుతున్నారు. ఆపై రాజకీయ సంక్షేమం ఎక్కువ. అందుకే ఉద్యమాల జోలికి యువత వెళ్లరు. ఆ ప్రభావం జనతా కాక్రోచ్ ఉద్యమంపై గణనీయంగా పడింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు