Homeతెలంగాణనల్లగొండ జిల్లాలో పలువురు ఎస్‌ఐల బదిలీలు..!

నల్లగొండ జిల్లాలో పలువురు ఎస్‌ఐల బదిలీలు..!

  • నల్లగొండ జిల్లాలో పలువురు ఎస్‌ఐల బదిలీలు..!

  • వాడపల్లి, మిర్యాలగూడ రూరల్, వేములపల్లికి కొత్త ఎస్‌ఐలు

మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: నల్లగొండ జిల్లా లో పోలీస్ శాఖ పరిధిలో పలువురు సబ్‌ఇన్‌స్పెక్టర్ల (SI) స్థానాల్లో మార్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్‌ఐలను నియమించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న పలువురిని వీఆర్‌ (VR)కు అటాచ్ చేసినట్లు తెలిసింది.

  • బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి..

వాడపల్లి ఎస్‌ఐగా ఎన్. ధర్మా: వాడపల్లి ఎస్‌ఐగా ఎన్. ధర్మాను నియమించినట్లు సమాచారం. అక్కడ అటాచ్‌మెంట్‌పై ఎస్‌ఐగా పనిచేస్తున్న సైదులును వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.

మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐగా యు. నగేష్: మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా యు. నగేష్‌ను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న లక్ష్మయ్యను వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.

వేములపల్లి ఎస్‌ఐగా సురేష్ రెడ్డి: వేములపల్లి ఎస్‌ఐగా సురేష్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వర్లును వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు