Homeతెలంగాణఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్...!

ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్…!

  • సిపిఐ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ ఘనవిజయం

  • అధికార పార్టీ మద్దతు తెలిపిన టిడబ్ల్యూయూ కూటమి ఓటమి

  • హస్తం అగ్రనాయకత్వం బరిలో దిగినా దక్కని ఫలితం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బ్యాలెట్ పద్ధతిలో గుర్తింపు ఎన్నికలు జరిగాయి. సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ నేతృత్వంలోని ఎంప్లాయిస్ యూనియన్ కూటమి 40 కి పైగా డిపోలను కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీ డబ్ల్యూ యు కూటమి కేవలం 20 డిపోలకే పరిమితం అయింది.. ప్రభుత్వం చేతిలో అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ.. కార్మికులు తమ హక్కుల పోరాటంలో సంప్రదాయ ఎర్రజెండా వెంట నిలబడ్డారు.

స్వయంగా టిపిసిసి చీఫ్ రంగంలోకి…

వాస్తవానికి ఈ గుర్తింపు ఎన్నికలు ప్రారంభమైనప్పటినుంచి రంగంలోకి దిగారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు. అయినా సరే కాంగ్రెస్ బలపరిచిన కార్మిక సంఘం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టింది కేవలం ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలు మాత్రమే. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం రీజియన్లు అధికార పార్టీ అభ్యర్థులు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు లోను కొంతమేర కాంగ్రెస్ వర్గం ప్రభావం చూపగలిగింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.

గ్రేటర్ లో ఘోరం…

గ్రేటర్ హైదరాబాద్ లోని 26 డిపోలకు గాను.. 23 చోట్ల ఈయు కూటమి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యూనియన్ కనుమరుగు అయ్యింది. ఉత్తర తెలంగాణ, నల్గొండ, నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. మరోవైపు ఈ గుర్తింపు ఎన్నికలు గులాబీ పార్టీకి సైతం షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ మద్దతు తెలిపిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేవలం 7 డిపోలకే పరిమితం అయింది. మూడో స్థానానికి పడిపోయింది. ఉద్యమ సమయంలో కార్మికులందరూ గులాబీ పార్టీ నీడకు వచ్చారు. కానీ ఇప్పుడు వారంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వివిధ సంఘాల్లో చేరిపోయారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఈవీఎంలపై విమర్శలు సరికావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  2.  మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా.. టైటిల్ అండ్ కాన్సెప్ట్ అదుర్స్!
  3.  మన్సూరాబాద్‌లో స్వీట్ షాప్ వద్ద రక్తపాతం..!
  4.  రెట్టింపు లాభాల ఆశ చూపి.. రూ.10 కోట్లకు టోకరా!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు