Homeఆంధ్ర ప్రదేశ్ఈవీఎంలపై విమర్శలు సరికావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ఈవీఎంలపై విమర్శలు సరికావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనత అని చెప్పుకుంటూ, ఓడిపోగానే ఎలక్షన్ కమిషన్ లేదా ఈవీఎంల (EVM)పై నిందలు వేయడం ఎంత మాత్రం సరికాదని ఆయన హితవు పలికారు.

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా.. టైటిల్ అండ్ కాన్సెప్ట్ అదుర్స్!

కృష్ణా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్లు ఎవరికి ఓటు వేశారో స్వయంగా చూసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు ఓట్ చోరీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ ఈవీఎంల మేనేజ్‌మెంట్ ఆరోపణలే నిజమైతే కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీశారు. నిజంగా అలాంటి అవకతవకలే జరిగితే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి నే గెలవాలి కదా అని అభిప్రాయపడ్డారు.రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలను అనవసరంగా రాజకీయాలకు ముడిపెట్టి విమర్శించడం తగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఆయన సూచించారు.

రెట్టింపు లాభాల ఆశ చూపి.. రూ.10 కోట్లకు టోకరా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు