Homeజాతీయంఆస్పత్రి నుంచి అన్నా హజారే డిశ్చార్జ్.. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందన్న వైద్యులు

ఆస్పత్రి నుంచి అన్నా హజారే డిశ్చార్జ్.. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందన్న వైద్యులు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ కారణంగా ఆగస్టు 31న ముంబైలోని బాంబే ఆస్పత్రిలో ఆయన చేరారు. వైద్యుల పర్యవేక్షణలో దాదాపు పది రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గురువారం (సెప్టెంబర్ 10) ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు.

ప్రస్తుతం అన్నా హజారేకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశ సేవ విషయంలో తన సంకల్పం ఏమాత్రం మారలేదని అన్నా హజారే స్పష్టం చేశారు. తన జీవితంలో ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు దేశానికి సేవ చేశానని పేర్కొన్న ఆయన.. 100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు కూడా దేశ సేవ కొనసాగిస్తానని తెలిపారు. ఆరోగ్యం సహకరించేంత వరకు ప్రజా సేవకు అంకితమవుతాననే తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు.

also read: హరియాణాలో కలకలం.. భర్తలను వదిలి నలుగురు పిల్లలతో ఇద్దరు మహిళలు పరార్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు