పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందనున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
గోపీచంద్ ‘స్పిరిట్’లో నటించనున్నారనే వార్తలపై ఇటీవల ఓ మీడియా సమావేశంలో సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వుతో స్పందించినట్లు తెలుస్తోంది. అయితే గోపీచంద్ నటనపై దర్శకుడు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. సందీప్ వంగా స్పందించిన తీరు మాత్రం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.
ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ ప్రచారానికి మరో కారణంగా నిలుస్తోంది. ప్రభాస్ సూచనతోనే సందీప్ రెడ్డి వంగా.. గోపీచంద్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై ‘స్పిరిట్’ చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రస్తుతం గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రభాస్ పాత్రతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంటుంది? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నిజంగానే గోపీచంద్ ఈ సినిమాలో భాగమైతే.. ప్రభాస్, గోపీచంద్‌లను ఒకే సినిమాలో చూడాలనుకునే అభిమానులకు ఇది ప్రత్యేక ట్రీట్‌గా మారే అవకాశం ఉంది.
also read: కోమటిరెడ్డి యూ టర్న్!
