Homeతెలంగాణతొలిరోజే విధ్వంసం.. చీర లాగారంటూ ఎమ్మెల్యే సునీత కన్నీటి పర్యంతం!

తొలిరోజే విధ్వంసం.. చీర లాగారంటూ ఎమ్మెల్యే సునీత కన్నీటి పర్యంతం!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:-తెలంగాణ శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) నాయకుల నడుమ జరిగిన నెట్టివేతలు, తోపులాటల వల్ల అసెంబ్లీ పరిసరాలు రణరంగంగా మారాయి.

మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం

అసెంబ్లీ లోపలికి వెళ్తున్న సమయంలో పోలీసులు తన పట్ల అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. తోపులాట క్రమంలో పోలీసులు తన చీరను కూడా లాగారని, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగానికి గురైన సునీతా లక్ష్మారెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు.

తోపులాటలో జగదీష్ రెడ్డికి గాయం
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లాక్ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు సభలోనికి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేత జరిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాలికి గాయమైంది.

రేవంత్ రెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్ హెచ్చరికఈ ఘటనపై బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులపై, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు.

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సూసైడ్ నోట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు