Homeఆంధ్ర ప్రదేశ్పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. కుటుంబానికి అండగా నిర్మాత ఎస్కేఎన్

పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. కుటుంబానికి అండగా నిర్మాత ఎస్కేఎన్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందిన పవన్ కల్యాణ్ అభిమాని రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో విషాదం నెలకొంది.

ప్రేమ్ కుమార్ మృతిపై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. మృతుడి కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

తాను కూడా ఒకప్పుడు అభిమానిగా ప్రయాణం ప్రారంభించానని, అభిమానుల భావోద్వేగాలు, వారి బాధలు తనకు తెలుసునని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా, వారి కష్ట సమయంలో తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఈ ప్రమాదం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ప్రేమ్ కుమార్ కుటుంబానికి పలువురు అభిమానులు, సినీ వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది.

also read: ‘రోమాంచకం’పై మహేశ్‌బాబు ప్రశంసలు.. చిత్రబృందానికి సూపర్‌స్టార్‌ శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు