Homeఆంధ్ర ప్రదేశ్'నిబద్ధత, సంకల్పం ఉన్న నాయకుడు': పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ జన్మదిన శుభాకాంక్షలు

‘నిబద్ధత, సంకల్పం ఉన్న నాయకుడు’: పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగభరితమైన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌ను ‘సంకల్ప సాధకుడు’ అని వర్ణించిన చిరంజీవి, ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం పవన్ సొంతమని చిరంజీవి పేర్కొన్నారు. అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచే తాను గమనిస్తున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. పవన్ తలపెట్టిన ప్రతి పనిలోనూ పూర్తిగా నిమగ్నమవుతారని, ఆయన వేసే ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే ఉంటుందని ప్రశంసించారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలను చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బీపీ టాబ్లెట్ ఒకరోజు మానేస్తే ఏమవుతుంది? వైద్యుల సలహాలు, సూచనలు

గ్రామస్థాయి అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల కనీస అవసరాలను తీర్చడం కోసం పవన్ ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పాలనలో పవన్ తనదైన ముద్ర వేస్తున్నారని, ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని మెగాస్టార్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఆయన పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా చేరుకోవాలని ఆశిస్తూ, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని చిరంజీవి తన ట్వీట్‌లో ప్రార్థించారు. పిఠాపురం ప్రజలకు కేవలం ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా పవన్ అండగా నిలుస్తున్నారని చిరంజీవి తన సందేశంలో ముగించారు. అన్నయ్య చేసిన ఈ భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు