Homeసినిమారష్మికను ‘వదిన’ అని పిలవను..: ఆనంద్ దేవరకొండ

రష్మికను ‘వదిన’ అని పిలవను..: ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి గురించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. తాజాగా విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ రష్మికను తాను ఎలా పిలుస్తారో చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

రష్మికను ‘వదిన’ అని సంబోధించకుండా.. తాను ‘రషీ’ అని పిలుస్తానని ఆనంద్ తెలిపారు. రష్మిక తనకంటే వయసులో చిన్నదని, అందుకే పేరుతోనే పిలుస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి ప్రత్యేక కారణం లేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు.. రష్మిక వ్యక్తిత్వంపై కూడా ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా పాజిటివ్‌గా ఉండే వ్యక్తి అని, మంచి మనసున్న కైండ్ సోల్ అని అన్నారు. ఎప్పుడూ సరదాగా, ఉత్సాహంగా ఉండే జోవియల్ పర్సన్‌గా రష్మికను అభివర్ణించారు.

ఇక రష్మికకు కొరియన్ డ్రామాలంటే చాలా ఇష్టమని ఆనంద్ వెల్లడించారు. ఆమెకు ఉన్న ఆసక్తి కారణంగా తన అన్న విజయ్ దేవరకొండ కూడా కొరియన్ డ్రామాలు చూడటం అలవాటు చేసుకున్నారని చెప్పారు.

రష్మికను తాను సింపుల్‌గా ‘రషీ’ అని పిలుస్తానంటూ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అన్న విజయ్‌తో రష్మికకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆనంద్ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

also read: కావ్యా కళ్యాణ్‌రామ్‌–కాలభైరవ పెళ్లి ప్రకటన.. ప్రేమకు అధికారిక ముద్ర!

తాజావార్తలు