Homeఅంతర్జాతీయంరేవ్ పార్టీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

రేవ్ పార్టీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

క్రైమ్ మిర్రర్ : స్విట్జర్లాండ్‌లో ఓ భారీ రేవ్ పార్టీలో అనూహ్యంగా కాల్పులు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో పాల్గొన్న వారిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూరిచ్ సమీపంలోని ఆర్గావ్ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా పార్టీకి వచ్చిన వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి కోసం భారీగా గాలింపు

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ఆర్గావ్ కాంటోనల్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా సైనిక హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సాయుధ పోలీసులను మోహరించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు? దాడికి గల కారణం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : మృత్యుంజయురాలైన ఆరేళ్ల చిన్నారి.. 3 రోజుల తర్వాత రెస్క్యూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు