Homeక్రైమ్హైదరాబాద్ శివారులో విషాదం: మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

హైదరాబాద్ శివారులో విషాదం: మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

హైదరాబాద్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువ వైద్య విద్యార్థిని అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని నాగారం ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం, నాగారం వెస్ట్ గాంధీనగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న దంపతుల కుమార్తె (26) ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెంగళూరు సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది. ఈ నెలలో ఇంటికి వచ్చిన ఆమె, ఆకస్మికంగా భవనం ఐదో అంతస్తు నుంచి దూకింది.

తీవ్ర గాయాలతో కిందపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఆమె ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు. అయితే చదువు ఒత్తిడి కారణంగా ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: వయసు అడ్డంకి కాదు: నటి ప్రగతి వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త మైలురాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు