Homeసినిమాప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?

ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?

క్రైమ్ మిర్రర్, సినిమా:- సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం స్పిరిట్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక అతిథి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే స్పిరిట్ లో తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ఐశ్వర్య దేశాయ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే వీరితో పాటు కథలో కీలక మలుపు తీసుకొచ్చే గెస్ట్ రోల్ కోసం మరో ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. సీసీటీవీలో రికార్డైన కాల్పుల దృశ్యాలు

ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటించిన కత్రినా, తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. 2024లో విడుదలైన మెరీ క్రిస్మస్ తర్వాత కొత్త సినిమా ప్రకటించకపోవడంతో అభిమానులు ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, స్పిరిట్ లో గెస్ట్ రోల్‌కు కేవలం ఒకటి లేదా రెండు రోజుల షూటింగ్ మాత్రమే అవసరమని తెలుస్తోంది. దీంతో కత్రినా ఈ పాత్రకు అంగీకరిస్తారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఒకవేళ కత్రినా కైఫ్ ఈ సినిమాలో నటిస్తే, స్పిరిట్ కు బాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఏసీబీ దాడిలో భారీగా ఆస్తులు.. డీఈ వెంకట రమణ అరెస్ట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు